
వరంగల్ గ్రామీణ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా కురుస్తున్న వానలకు వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు కట్ట తెగి వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపైకి ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి జాతీయ రహదారి కోతకు గురై.. రోడ్డు కొట్టుకుపోయింది.

రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి.

ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా