ETV Bharat / state

అల్లాడుతున్న వరంగల్​... అస్తవ్యస్తమైన జన జీవనం - వరంగల్​లో వరదలు

తిందామంటే తిండి లేదు. కంటిమీద కునుకులేదు. బయటికెళితే వరదమయం. ఇంట్లో ఉంటే బురద భయం. ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో తోచక... ఉమ్మడి వరంగల్‌ జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం వల్ల.. పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి కొట్టుకుపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటు ములుగు జిల్లా మేడివాగులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది.

heavy rains and floods in warangal
వరంగల్​పై వరుణుడి ప్రకోపం... అస్తవ్యస్తమైన జన జీవనం
author img

By

Published : Aug 22, 2020, 5:08 AM IST

Updated : Aug 22, 2020, 7:15 AM IST

అల్లాడుతున్న వరంగల్​... అస్తవ్యస్తమైన జన జీవనం

ఎడతెరిపిలేని వర్షాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం కాస్త వర్షం తగ్గినా... సాయంత్రం నుంచి మళ్లీ ఊపందుకున్న వాన నగరవాసుల్లో ఆందోళన నింపింది. జేసీబీల సాయంతో నాలాల్లో చెత్తాచెదారం తీసి.. వరదనీరు పారేలా బల్దియా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లలో బురద భారీగా పేరుకుపోయి నిత్యావసర సరకులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బియ్యం పాడైపోయాయి. తమను ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎప్పుడు ఏ గట్టు తెగుతుందో..

వరంగల్ గ్రామీణ జిల్లాలో చెరువు కట్టలు బలహీనపడుతున్నాయి. కోనారెడ్డి చెరువు కట్ట తెగడంతో.. ఖమ్మం-వరంగల్‌ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉప్పరపల్లి క్రాస్‌రోడ్ నుంచి పర్వతగరి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు. కోతకు గురైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఉప్పరపల్లిలోని ఊర చెరువుకు సైతం గండి పడింది. సకాలంలో గుర్తించిన స్థానికులు ఇసుకబస్తాలు, గడ్డివాములు, రాళ్లతో గండిని పూడ్చడం వల్ల ప్రమాదం తప్పింది.

ఉప్పొంగుతున్న చెరువులు

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెక్కొండ మండలం బంజరుపల్లి, లావుడ్యా వాగ్యా నాయక్‌ తండాల పరిధిలోని పాలచెరువు ఉప్పొంగుతోంది. చెరువు కట్ట ఓ చోట కుంగడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి... హుటాహుటిన ప్ల్రొక్లెయిన్‌ సాయంతో మత్తడిని పగలగొట్టించారు. కట్ట దెబ్బతిన్న ప్రదేశంలో రెండు వేల ఇసుక బస్తాలతో మరమ్మతులు చేయించారు.

ములుగు జిల్లాలో వాగుల ఉద్ధృతి

ములుగు జిల్లాలో వాగుల ఉద్ధృతి తగ్గట్లేదు. రామప్ప చెరువు మత్తడి పడి వెంకటాపూర్‌ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, గంపోని గూడెం గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు.. గ్రామస్థులను పునరావాస శిబిరాలకు తరలించారు. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో ఏటూరునాగారం-హన్మకొండ ప్రధాన రహదారిపై మేడివాగు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో పెద్దఎత్తున పంటలు కొట్టుకుపోయాయి. పాపయ్యపల్లె, పాల్సబ్ పల్లి, జంగాలపల్లి, ఇంచర్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం మేడివాగులో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కాగా... అందులో శివాజీ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

హెచ్చరికలు పాటించకపోతే ఎలా..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని అధికారులు రక్షించారు. చేపలు పట్టేందుకు వెళ్లొద్దని చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసినందుకు పోలీసులు అతడికి వేయి రూపాయల జరిమానా విధించారు.

ఇదీ చూడండి: 'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'

Last Updated : Aug 22, 2020, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.