వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి పర్యవేక్షించాలని సూచించారు.
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఆకేరువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
- ఇదీ చదవండి : వాగు దాటాలి.. విద్యార్థులను చేరాలి..