వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు పరకాల పట్టణంలోని దామెరచెరువు, పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
పరకాలలోని లోతట్టు ప్రాంతాలైన మమతనగర్, శ్రీనివాస కాలనీలు పాక్షికంగా జల దిగ్బంధంలో ఉన్నాయి. 22వార్డులో వర్షం నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సవ్యంగా లేకపోవడం వల్ల పట్టణ నడిబొడ్డులోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సబ్‌డివిజన్‌లో కటాక్ష్యపూర్ చెరువు అలుగు పారి ములుగు జాతీయ రహదారిని ముంచేసింది. దాదాపు 1000 ఎకరాలలోని పంట నీటిపాలు అయ్యింది. పత్తి, వరి, మిర్చి నీటిపాలు అయి అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇదీ చూడండి: గగన్‌పహాడ్ వద్ద వరద ఉద్ధృతి.. 3 మృతదేహాలు వెలికితీత