వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అవగాహన కార్యక్రమం కల్పించారు. ప్రజలందరూ తన పిల్లలను గురుకులాల్లో చేర్చే విధంగా ప్రోత్సహించారు. పట్టణంలో మానవహారం చేపట్టారు. తమ ఆట పాటల ద్వారా ఐదో తరగతిలో చేరడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ దరఖాస్తుకు చివరి రోజని తెలిపారు.
గురుకులాల్లో బాలబాలికలకు 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తారని వివరించారు. సన్న బియ్యంతో భోజన సౌకర్యం, క్రీడలు ఉంటాయని తెలిపారు. ఉచితంగా వచ్చే ప్రభుత్వ గురుకులాల విద్యను నిర్లక్ష్యం చేయొద్దని కచ్చితంగా తమ పిల్లలను అందులోనే చేర్చాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: గబ్బర్‌సింగ్ పెళ్లి సీన్ రిపీట్... పీటల మీది నుంచి వెళ్లిపోయిన వధువు