ETV Bharat / state

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు గులాబీ మొక్కలు పంపిణీ చేశారు ఓ వరంగల్ జిల్లా వాసి. తండ్రి పేరున పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఆ వ్యక్తి ఆశయాన్ని అందరూ అభినందిస్తున్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ
author img

By

Published : Aug 9, 2019, 11:41 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం 200 మంది పాఠశాల విద్యార్థులకు గులాబీ మొక్కలు అందజేశారు. విద్యార్థులు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ విద్యార్థులను ఉద్దేశించి చెట్లను పెంచే ప్రక్రియ జీవితంలో ఒక భాగం కావాలన్నారు. పాత్రికేయులకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఒక వెయ్యి మెుక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటానని పేర్కొన్నారు. డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మొక్కల పంపిణీ

ఇదీ చూడండి : బిల్డింగ్​లు కట్టి వదిలేస్తారా..! ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.