వరంగల్ గ్రామీణజిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని నిరుపేద ప్రజల సొంతింటి కళ నెరవేరింది. ఈ మేరకు అర్హులైన 50 మందికి స్థానిక ఎమ్మార్వో, ఆర్డిఓలు లాటరీ పద్దతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారు.
ఇన్నాళ్లుగా సొంత ఇళ్లులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు తెరాస ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనంద బాష్పాలు కారుస్తూ ఇళ్ల పట్టాలను స్వీకరించి నూతన ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, రెవిన్యూ సిబ్బంది, తెరాస మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 2021 వేగంగా గడిచిపోతుంది.. ఎందుకో తెలుసా?