ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ప్రేమికుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఆ యువతి ములుగు మండలం బండారుపల్లికి చెందిన సంతోష్‌ను ప్రేమించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ వివిధ పార్టీల మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులతో ప్రేమికుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది.
గత రెండేళ్లుగా హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా ఇద్దరం పనిచేశావాళ్లమని బాధితులు పేర్కొంది. ఆ క్రమంలో ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది. ముందుగా తనను ప్రేమించే సమయంలో ఎస్సీ కులస్తురాలినని చెప్పింది. ప్రియుడు పెరక కులస్తుడని.. వద్దు అని చెప్పినప్పటికీ.. కులాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె వాపోయింది. రెండేళ్లుగా ప్రేమిస్తూ సినిమాలు, షికార్లకు తీసుకెళ్లి అన్ని విధాలుగా వాడుకున్నాడని వెల్లడించింది. పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. కులం పేరుతో కాదంటున్నాడని.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి : కట్టెల మండిలో భారీ అగ్నిప్రమాదం