ETV Bharat / state

వరంగల్​ జిల్లాలో విదేశీయుల సందడి - వరంగల్​ జిల్లా తాజా వార్తలు

Foreigners visit warangal: "పల్లెసీమలే పట్టుకొమ్మలు" అని అన్నారు గాంధీజీ. మన దేశంలో ఉన్న గ్రామీణ వాతావరణం గురించి తెలుసుకోవడానికి విదేశీయులు ఎంతో ఆసక్తి చూపుతారు. తాజాగా వరంగల్​ జిల్లా వర్ధన్నపేటకు బాలవికాస స్వచ్ఛంద సంస్థ పనితీరును, గ్రామీణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు.

విదేశీయుల సందడి
విదేశీయుల సందడి
author img

By

Published : Jan 19, 2023, 5:44 PM IST

Foreigners visit warangal: గ్రామీణ ప్రాంతానికి పెట్టింది పేరు భారతదేశం. మన దేశానికి ఏటా ఎంతో మంది విదేశీయులు గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయడానికి వస్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విదేశీయులు సందడి చేశారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్​​ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్​ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోని పలు విషయాలపై అధ్యయనం చేసేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా బాలవికాస అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, పొదుపు సంఘాల పనితీరుపై అధ్యయనం చేశారు. అనంతరం పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో చిరు వ్యాపారుల వద్ద పండ్లు కొనుగోలు చేసి అక్కడి ప్రజలతో మమెకమై వారి జీవన విధానాలపై తమ కెమెరాల్లో బంధించుకున్నారు.

నైజీరియా, ఈజిప్టు, ఘనా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, మారిషస్, సుడాన్, సిరియా, జోర్దాన్ దేశాలకు చెందిన వీరికి ఎన్ఐఆర్​డి కోఆర్డినేటర్ ప్రదీప్​గౌడ్ అనే వ్యక్తి భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా గ్రామీణ ప్రాంతాల వాతావరణం వారికి తెలియజేస్తున్నారు.

వరంగల్​ జిల్లాలో విదేశీయుల సందడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.