వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆటోతో జీవనం సాగిస్తున్న కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారింది. వారికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన