ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అవస్థలు - రైతుల ఇబ్బందులు

వరంగల్ గ్రామీణ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాలు పోటెత్తాయి. వారం పది రోజులైనా కొనుగోళ్లు జరగకపోవడం, సరిపడా గిడ్డంగులు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ సామర్థ్యం లేదని కొనుగోలు కేంద్రాలకు తాళాలు వేయడం వల్ల అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

farmers-worried-over-delay-in-paddy-procurement-in-warangal-rural-district
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అవస్థలు
author img

By

Published : May 31, 2020, 3:12 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఎన్నో అగచాట్లు పడుతున్నారు. పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ సర్కారు మాటకు కట్టుబడి కొనుగోలు చేస్తోంది. అయితే కొనుగోళ్లకు మే 31 చివరి తేదీగా నిర్ణయించింది. కానీ..అధికారులు పూర్తిస్థాయిలో రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. టోకెన్ల పద్ధతి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దాంతో రైతులు పండించిన పంట పూర్తిస్థాయిలో సేకరించడం సాధ్యం కాలేదు.

అధికారులు చొరవ చూపడం లేదు..
ముఖ్యంగా జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెo, పర్వతగిరి, ఐనవోలు మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె వాహనాల్లో ధాన్యాన్ని తరలించి ఎప్పుడు కొంటారని పడిగాపులు కాస్తున్నారు. ఇచ్చిన టోకెన్ల గడువు తీరిన తమ ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని, అద్దెకు తీసుకువచ్చిన వాహనాల ఖర్చులకు ఇబ్బందిగా మారుతుందని అన్నదాతలు వాపోతున్నారు. కొనుగోళ్ల విషయంలో అధికారులు చొరవ చూపడం లేదని, సకాలంలో పంటను కొనుగోలు చేయట్లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో నిల్వ సామర్థ్యం లేదని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తాళం వేయడం వల్ల ధాన్యం బస్తాలతో వచ్చిన వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము పండించిన పంటను త్వరితగతిన కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కర్షకులు.

గందరగోళ పరిస్థితుల్లో అన్నదాతలు

ప్రభుత్వం విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. వచ్చే నెల 8 వరకు కొనుగోళ్లు జరుపుతామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ధాన్యం ఎండబోసి, నిబంధనల మేరకు అమ్మకానికి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాల్లో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై దృష్టి సారించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: అధికారుల సూచనతో అధిక పంట సాగుకు అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.