ఎనిమిది రోజుల వయసున్న పిల్లాడికి కాలం చెల్లిన సెలైన్ ఎక్కించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సురుగురి రాజు, మాధురి దంపతులకు ఎనిమిది రోజుల క్రితం బాబు జన్మించాడు. పిల్లాడికి కొంత అనారోగ్యంగా ఉండటం వల్ల పట్టణంలోని తనూష పిల్లల ఆసుపత్రికి తరలించారు.
చిన్నారిని పరీక్షించిన వైద్యుడు జాన్సన్... బాబుకు పసిరికలు అయ్యాయని తెలిపాడు. ఫొటో థెరఫీ బాక్స్‌లో పెట్టి చికిత్స అందించాలని వైద్యుడు సూచించాడు. ఆయన సూచన మేరకే చికిత్స అందించాలని తల్లిందండ్రులు తెలపగా... బాబును ఫొటో తెరఫి బాక్సులో ఉంచారు. సెలైన్ కూడా ఎక్కించారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాబు దగ్గరికి వెళ్లి చూడగా.. ఆ సెలైన్ బాటిల్ మీద ఎక్స్పైరీ తేదీ 2021-ఏప్రిల్ వరకే ఉండటాన్ని గమనించారు. వెంటనే సిబ్బందికి తెలియజేయగా.. తీసేశారు. అప్పటికే చిన్నారికి సగానికి పైగా సెలైన్ ఎక్కటం వల్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఇదేంటని నిలదీస్తే.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై వైద్యుడు జాన్సన్‌ను అడిగితే.. గడువు తీరిన సెలైన్ ఎక్కించినా చిన్నారికి ఎలాంటి ఇబ్బంది రాదని సమాధానం ఇవ్వటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. బాబుకు ఏం కాదని... నెల రోజుల వరకు చిన్నారి బాధ్యత తనదే అని వైద్యుడు భరోసా ఇవ్వగా.. కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:
weather report: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం