పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరంగల్ తూర్పు, పశ్చిమ వర్ధన్నపేట పరకాల నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి పంపిణీ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను అందించారు. రవాణా సౌకర్యంతో పాటు వారికి భోజన సౌకర్యాలను కల్పించారు.
ఇవీ చూడండి: 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'