కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మూడునెలల్లో కాళేశ్వరం, ఎస్సారెస్పీ పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి నీరందించేలా కృషిచేస్తామన్నారు. కార్యకర్తలంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, కష్టించి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో 80శాతం, మండలాల్లో 70శాతం ఓట్లు వస్తేనే తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అస్థిత్వాన్ని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్, ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
దత్తత తీసుకుంటా... కానీ ఒక షరతు: ఎర్రబెల్లి - malotu kavita
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.