ETV Bharat / state

పథకాలు ఘనం... పారిశుద్ధ్యం శూన్యం... - DUSTBINS

అమృత్, హృదయ్, స్మార్ట్ ​లాంటి కేంద్ర పథకాలతో పోటీ పడి సత్తా చాటినా...నగరవాసుల మన్ననలు నోచుకోలేదు. మహా నగరంగా రూపాంతరం చెందినా...మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం విఫలమైంది వరంగల్ నగరం.

నగరంలో నరకయాతన
author img

By

Published : Mar 17, 2019, 1:32 PM IST

Updated : Mar 17, 2019, 3:43 PM IST

నగరంలో నరకయాతన
వరంగల్ నగర పాలక సంస్థ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​గా రూపాంతరం చెందినప్పటికీ నగరంలో పరిస్థితులు మాత్రం మారలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎటు చూసినా చెత్తకుప్పలు, దోమలే.

పారిశుద్ధ్య సమస్యలను అధిగమించేందుకు గత కమిషనర్ గౌతం స్వచ్ఛ ఆటోలను ప్రవేశపెట్టారు. డివిజన్ మొత్తం 240 ఆటోలను కెనరా బ్యాంకు సాహకారంతో నిరుద్యోగ యువకులకు అందజేశారు. ఈ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తాయి. రవాణా భారం ఎక్కువ కావడం వల్ల ఆటోల నిర్వహణ కోసం చెత్త సేకరణపై 60 రూపాయలను పన్నుగా విధించాలని కౌన్సిల్ తీర్మానం చేసింది.

ఇలా ప్రతిరోజు నగరంలో సేకరించే చెత్తను రాంపూర్​లోని డంపింగ్ యార్డులో కాకుండా నగర శివార్లలోని ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. అలా వేయడం వల్ల పరిసర ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాలనీల వద్ద చెత్త వేయడం వల్ల దుర్గంధం, తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. డీజిల్ ఖర్చులు తగ్గించుకోవడం కోసమే స్వచ్ఛ ఆటో నిర్వాహకులు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:వీరే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు

Intro:Body:Conclusion:
Last Updated : Mar 17, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.