కరోనా వైరస్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలంతా గడపదాటకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం రసాయనాలను పిచికారి చేసే డ్రోన్ స్ప్రేయర్ తెప్పించారు. కరోన వైరస్ను తరిమికొట్టాలంటే సామాజిక దూరం తప్పనిసరన్నారు. మాస్క్లు ధరించడంతో పాటు, సానిటైజర్లు తప్పకుండా వాడాలని కోరారు.
ఇవీ చూడండి: దేశంలో కరోనా విజృంభణ- 12 గంటల్లో 240 కేసులు