వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల నియోజకవర్గంలోని కొందరు అంగన్‌వాడీ టీచర్లు సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చారు. నియోజకవర్గంలోని నాగారం గ్రామ అంగన్‌వాడీ టీచర్లు ప్రసన్న రాణి, రమాదేవి, కవిత, శ్రీలతలు రూ.10 వేలు విరాళమివ్వగా... పట్టణానికి చెందిన అంగన్‌వాడీ ఆయా బాలోజీ లక్ష్మి రూ. 3 వేలు అందించింది. ఈ విరాళాల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సాయమందించిన వారికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు