కులసంఘానికి కేటాయించిన భవనాన్ని ఓ మాజీ సర్పంచ్ మరో వ్యక్తికి అమ్మాడు. ఆ వ్యక్తి యాథేచ్చగా నల్లా కనెక్షన్ సైతం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కులస్తులు మా భవనం మాకు ఇప్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ భవనాన్ని ప్రభుత్వం 2006లో లక్షా యాభై వేలతో నిర్మించింది. ప్రభుత్వ సొమ్ముతో కట్టిన కుల సంఘం భవనంను తాజాగా రూ. 3.20 లక్షలకు అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న కాసోజుల రమణకు అమ్మాడు.
సదరు వ్యక్తి శిలాఫలకం తొలగించి కొత్త నిర్మాణాలను చేపట్టడం వల్ల సమస్య రచ్చకెక్కింది. ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పినా, అనుమతి లేని భవనానికి నల్ల కనెక్షన్ ఇచ్చిన కారోబర్కు మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టి దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు