వరంగల్ నగరంలో ధరణి ఇంటింటి సర్వే వేగంగా సాగుతోంది. బల్దియా కమిషనర్ పమేలా సత్పతి టార్గెట్లు ఇవ్వడం వల్ల సర్వే చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి యజమాని వద్ద ఆస్తుల వివరాలను సేకరించి ధరణి యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.
కొంతమేర సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు సిబ్బంది తెలిపారు. యజమానుల నుంచి సహకారం ఉందని తెలిపిన క్షేత్రస్థాయి సిబ్బంది.. మైనారిటీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
ఇదీ చూడండి: శరవేగంగా కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు.. వచ్చే ఏడాది కల్లా ప్రారంభం