వరంగల్ రూరల్ జిల్లా పరకాల కూరగాయల మార్కెట్ అట్టహాసంగా ప్రారంభించిన మూడో రోజే అటు కొనుగోలుదారులకు ఇటు అమ్మకపుదారులకు చుక్కలు చూపిస్తుంది. ప్రారంభించిన మూడు రోజులకే కరెంటు లేకపోవడం పై మండిపడుతున్నారు. కరెంట్ బిల్లు లేకుండా తాము కరెంటు ఇవ్వలేమంటూ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విద్యుత్ అధికారులు మార్కెట్కు సంబంధించిన విద్యుత్ లైన్ కట్ చేయగా మార్కెట్లో అంధకారం అలముకుంది. దీనితో మార్కెట్లోకి వచ్చిన కూరగాయల కొనుగోలుదారులు, వర్తకులు నానా అగచాట్లు పడుతున్నారు. తమ వద్ద ప్రతి రోజు డబ్బులు వసూలు చేయడానికి ముందుండిన అధికారులు సరైన విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం సిగ్గుచేటని వర్తకులు వాపోతున్నారు.
ఇదీ చూడండి:ఈల్ చేప చర్మం నుంచి కొల్లాజెన్