వరంగల్ గ్రామీణ జిల్లాలో నత్త నడకన సాగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులపై జిల్లా వ్యవసాయాధికారి ఉషా దయాళ్ అసహనం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట మండల పరిధిలో పర్యటించిన ఆమె నిర్మాణంలో ఉ న్న రైతు వేదికల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వం నిధులు కేటాయించి.. విడుదల నప్పటికీ మూడు నెలలుగా పనుల పట్ల ఎందుకు పురోగతి సాధించలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా నాటికి రైతు వేదికలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని వారిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.