ETV Bharat / state

ఆ గ్రామంలో పిట్టల్లా రాలుతోన్న జనం - వరంగల్ గ్రామీణ జిల్లా కరోనా కేసులు

వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారి బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలొదులుతున్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో గడిచిన 20 రోజుల వ్యవధిలో 9 మంది మహమ్మారికి ధాటికి బలయ్యారు.

Corona second phase
కరోనా రెండో దశ
author img

By

Published : May 10, 2021, 12:06 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా రెండో దశ విలయ తాండవం చేస్తోంది. కేసుల పెరుగుదలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో కరోనా దాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో 9 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

తొలుత రెండు కరోనా మరణాలు సంభవించిన సమయంలో అధికారులు గ్రామస్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకే రోజు 90 కేసులు వెలుగు చూసాయి. అలా రెండు సార్లు అడపా దడపా పరీక్షలు నిర్వహించి వారు వెళ్లిపోయారు. ఆ తరువాత గ్రామంలో రెండు రోజులకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు వీరమళ్ళ కృష్ణారెడ్డి, యశోదలను మహమ్మారి పొట్టన పెట్టుకుంది.

ఒకేరోజు భార్యభర్తలిద్దరూ మరణించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కేసులు గుర్తించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహించి మరణాలను నివారించాలని వారు వేడుకుంటున్నారు. ఇప్పటికే వారంతా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.

ఇదీ చదవండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.