లాక్డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు 8 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. బ్రాహ్మణవాడలో ఓ వైద్యుడితో పాటు.. అతని కొడుకు, వైద్యుడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కరోనా సోకింది. ఎక్సైజ్ కాలనీకి చెందిన యువకుడు.. శస్త్రచికిత్స చేయించుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లగా అతడికి వైరస్ సోకింది. ఎంజీఎం కొవిడ్ వార్డులో 10మంది కరోనా పాజిటవ్ వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆరంభం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకుండా...రికార్డు నెలకొల్పగా లాక్డౌన్ సడలింపు తర్వాత రెండు కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో సహా.. నలుగురు పెద్దలకు కూడా వైరస్ సోకింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6గురికి కరోనా పాజిటివ్ రాగా వారు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
జనగామ జిల్లాలో శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో సడలింపుల తరువాత ఐదుగురికి కరోనా సోకింది. అందులో నలుగురు చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా....ఒకరు చనిపోయారు. మహబూబాబాద్‌లో కూడా నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వాలు లాక్డౌన్ సడలిస్తే..సడలింపును సరిగా అర్థం చేసుకోకుండా.. దుర్వినియోగం చేయడం వల్ల కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయ్. ఉదయం 8 గంటలనుంచి...రాత్రి 8 గంటలవరకు రోడ్లపైనా, మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. భౌతిక దూరం పాటించకపోవడం.. మాస్కులు ధరించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయంటున్న్రు ఆరోగ్య నిపుణులు. సామాజిక వ్యాప్తి జరగలేదన్న సంతోషం ఉన్నా.. కేసులు రోజురోజుకి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తేనే కేసుల తగ్గుముఖం పడతాయి. కాబడ్డి తగు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు వైద్యులు.
ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!