భారత రాజ్యాంగ దినోత్సవం పురష్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని ఇరవైతొమ్మిది గ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ర్యాలీ చేశారు. రాజ్యాంగ నియమాలు అనుసరించి బాధ్యత యుతంగా నడుచుకుంటామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండలపరిషత్ అధ్యక్షురాలు ఊడుగుల సునితాప్రవీణ్, ఎంపీడీవో శంకర్, మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం: పోచారం