వరంగల్ రీజియన్లో ఐదో రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దసరా పండుగ ముగిసినందున... తిరుగు ప్రయాణమయ్యేవారితో వరంగల్ హైదరాబాద్ మార్గంలోని బస్టాండ్లలో రద్దీ ఎక్కువుగా ఉంది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో వివిధ మార్గాల్లో 64శాతం మేర బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పల్లెవెలుగు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు... డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్లతో పరీక్షలు చేస్తున్నారు. కార్మిక సంఘాలు నగరంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద నిరసన చేపట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, భాజాపా నాయకులు ధర్మారావు, రావు పద్మ సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండిః అరెస్టులకు భయపడేదిలేదుః అశ్వత్థామ రెడ్డి