ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలని కోరుతూ వరంగల్ హన్మకొండలో కాంగ్రెస్ జిల్లా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఏకశిలా పార్క్ ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పాల్గొన్నారు.
రైతులు సాగుచేసిన సన్నరకం వరి ధాన్యాన్ని క్వింటాలకి రూ. 2,500 చొప్పున ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: టోకెన్లు ఇవ్వడం లేదంటూ మిర్యాలగూడలో రైతుల ధర్నా