ETV Bharat / state

వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి: కాంగ్రెస్

గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 15వ డివిజన్​లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. తెరాస, భాజపాలకు ఓటుతోనే బుద్ది చెప్పాలని నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి వెంకట్రాం అన్నారు.

congress campaign
congress campaign
author img

By

Published : Apr 27, 2021, 4:02 PM IST

గ్రేటర్​ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 15వ డివిజన్​లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి వెంకట్రాం... కాంగ్రెస్​ అభ్యర్థి ప్రవీణ్​రావు తరఫున ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ... కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అత్యధిక మెజార్టీతో ప్రవీణ్​రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వస్తే… ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పిన కేసీఆర్​… వారి కుటుంబానికి మాత్రమే లబ్ధి చేరుకుందని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం తెరాస, భాజపాలు ఓట్లకు వస్తారని… వారికి తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని వెల్లడించారు. కాంగ్రెస్​తోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.