వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో మరో పది రోజుల్లో 30 పడకలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ హరిత తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి, వైద్య బృందంతో కలిసి ఆమె ఆసుపత్రిని సందర్శించారు. అన్నివార్డుల్లో కలియ తిరిగారు.
ఇప్పటికే ఇరవై ఆక్సిజన్‌తో కూడిన పడకలు అందుబాటులొ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసమే లాక్ డౌన్ విధించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాల్ పాల్గొన్నారు.