వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత తనిఖీ చేశారు. 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై అధికారులను ఆరా తీశారు. ఈ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలన్నారు. ఊరుగొండను అభివృద్ధి చేసి జిల్లాలో ఉత్తమ గ్రామంగా నిలిచేలా ప్రజలందరూ కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండిః మా మోకాళ్లు కనిపిస్తే మీకేంటి?