వరంగల్ గ్రామీణ జిల్లాలో కలెక్టర్ హరిత ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా సంగెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న ఆస్తుల సర్వేపై ఆరా తీశారు. ధరణి నమోదు వివరాలను ఎమ్మార్వోను అడిగి తెలుసుకున్నారు.
ఆస్తుల నమోదుకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా ధరణి ఆస్తుల నమోదు జరగాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సివిల్ సప్లై కమిషనర్