వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమీక్షకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమేష్ హాజరయ్యారు. వర్ధన్నపేట పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు సమస్యలపై సమగ్ర నివేదికలను అందించారు. నివేదికలో తాగునీరు, కరెంట్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీకి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే గ్రామాల సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకు అనుగుణంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
పనులు త్వరితగతిన పూర్తి చేయాలి...
స్పందించిన సదరు శాఖల అధికారులు వివరణ ఇవ్వగా.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం నిధులు ఇతరత్రా విషయాల విడుదల సహా పెండింగ్ పనులను పరిష్కరించాలని కలెక్టర్ హరితను ఎమ్మెల్యే రమేశ్ ఫోన్లో కోరారు.