పిల్లలు చదువు, క్రీడలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ ఎం. హరిత పిలుపునిచ్చారు. సోమవారం దామెర మండలంలోని ఒగ్లాపూర్ మైనారిటీ గురుకుల, బీసీ గురుకుల పాఠశాలల్లో నిర్వహించిన నులిపురుగుల నివారణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బయటకు వెళ్లినప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే నులిపురుగులు శరీరంలోకి వెళ్లే ప్రమాదముందని.. చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలని ఆమె తెలిపారు.
నులిపురుగులు చిన్నపేగు, పెద్దపేగులోకి చేరి ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులకు, ఫిట్స్, రక్తహీనత, చర్మ సంబంధ వ్యాధులకు కారణమవుతాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్యామ నీరజ, తహసీల్దార్ రజనీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: శుచి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: గవర్నర్ తమిళిసై