ETV Bharat / state

'కరోనాకి కాలం చెల్లింది.. వ్యాక్సిన్​తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు' - challa dharma reddy on corona vaccination news

కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్​ను అంతమొందించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ వాక్సిన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవని స్పష్టం చేశారు.

challa dharma reddy on corona vaccination at parkal
'వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
author img

By

Published : Jan 13, 2021, 6:22 PM IST

ఈ నెల 16న కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల పట్టణంలోని సివిల్ హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్​ను అంతమొందించే సమయం ఆసన్నమైందని తెలిపారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి..

వాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే వాక్సిన్ వేయడం కోసం వైద్యులకు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. 16న పరకాల,ఆత్మకూరు టీకా వేయనున్నట్లు తెలిపారు. ఈ వాక్సినేషన్ కార్యక్రమంలో రెవెన్యూ, మెడికల్, పోలీస్, విద్యుత్ తదితర శాఖలు కీలకపాత్ర పోషించనున్నాయన్నారు. తొలి విడతలో వైద్య,ఆరోగ్య సిబ్బందికి,అంగన్వాడీ,ఆశ కార్యకర్తలకు వాక్సిన్ ఇస్తామన్నారు.

కరోనా కథ ముగింపు..

ఈ వాక్సిన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవని ప్రజలు భయాందోళన చెందవద్దని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలమన్నారు. ఈ వాక్సిన్​తో కరోనా కథ ముగియనుందన్నారు. ప్రజలు ఆయురాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాని తెలిపారు.

ఇదీ చూడండి: 'దేశంలో 11 నగరాలకు చేరిన కొవాగ్జిన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.