ETV Bharat / state

'నేనేం పాపం చేశా.. శిథిలమవుతున్నా పట్టించుకోరేం'

వరంగల్‌ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులో 54 ఏళ్ల కిందట చలివాగు ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి రైతుల పంట పొలాలకు నీటిని అందిస్తుంది ఈ ప్రాజెక్ట్​. ఏటా ఈ జలాశయం నీటిని వినియోగించుకుని రైతులు రెండు పంటలను పండిస్తూ లక్ష క్వింటాళ్ల దిగుబడి అందుకుంటున్నారు. దేవాదుల నీటితో నిండుగా ఉంటూ మిషన్‌ భగీరథ పథకంలో భాగస్వామినై ప్రజల దాహార్తిని కూడా తీర్చుతుంది. అయినా పాలకులు, అధికారులు జలాశయాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఎక్కడిక్కడ శిథిలమైపోతున్నా.. ఏటా రెండుసార్లు ప్రాజెక్టు సందర్శనకు వచ్చి ఆర్భాటంగా విడుదల చేస్తున్నారే తప్ఫ. నిధులు మంజూరు చేయించి బాగు చేయిస్తామన్న సోయి లేకుండా పోయింది.

నేనేం పాపం చేశా.. శిథిలమవుతున్నా పట్టించుకోరేం

author img

By

Published : Dec 3, 2020, 10:45 AM IST

ఏటా 12 వేల టన్నుల దిగుబడికి నీటిని అందిస్తున్న జలాశయం నేడు శిథిలావస్తకు చేరుకుంది. ఎన్నిసార్లు ప్రాజెక్టు గురించి రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లెేదు. 54 ఏళ్ల కిందట నిర్మితమైన ప్రాజెక్టు పరిస్థతి ఆత్మఘోష రూపంలో..

దేవాదుల, మిషన్‌ భగీరథలో భాగస్వామినయ్యా..

నా ఆయకట్టు పరిధిలో 3046 ఎకరాలు సాగవుతున్నాయి. అనధికారికంగా మోటార్ల సాయంతో మరో 3000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. వానాకాలం, యాసంగిలో తైబంధీ కేటాయిస్తూ వస్తున్నారు. శాయంపేట మండలం పెద్దకోడెపాక, జోగంపల్లి, కొప్పుల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దామరంచపల్లె రైతులు నా మీద ఆధారపడి సాగు చేస్తున్నారు. మైలారం, పత్తిపాక, హుస్సేన్‌పల్లి, నేరేడుపల్లి, ప్రగతిసింగారం గ్రామాల రైతులు సైతం బ్యాక్‌ వాటర్‌ను వాడుతున్నారు. సుమారుగా 12 వేల టన్నుల దిగుబడికి నా నీటిని వాడుకుంటున్నారు. 2007వ సంవత్సరంలో దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.3.75కోట్లు నిధులు మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే కొండా సురేఖ పాలనలో తూము, కాలువ పనులు పూర్తి చేశారు. నాసిరకంగా పనులు చేయడంతో కొన్నాళ్లకే పూర్తిగా దెబ్బతిన్నాను. దేవాదుల వాళ్లు సొరంగం పనులు నిర్లక్ష్యంగా చేయడం వల్ల 2011వ సంవత్సరం జూలై 15వ తేదీ రాత్రి బుంగ పడటంతో ముగ్గురు వలస కార్మికులు (జల సమాధి) నాలో కలిసిపోయి ప్రాణాలు విడిచారు. బుంగ పూడ్చేందుకు నానా తంటాలు పడి పెద్దపెద్ద బండరాళ్లు, కాంక్రీట్‌తో నన్ను పూడ్చివేశారు. ఆయకట్టు రైతులకు పూర్తిగా నీరందించలేకపోతున్నాను. రానురాను దేవాదుల ప్రాజెక్టులోనూ అంతర్భాగమై పోయాను.

ఏ క్షణాన కూలుతానో...

భూపాలపల్లి మండలం భీంఘన్‌పూర్‌ నుంచి నీటిని తీసుకువచ్చి నాలో నింపి, ఇక్కడి నుంచి ధర్మసాగర్‌కు తీసుకుపోతున్నారు. నిత్యం నీటితో నిండుగా ఉంటున్నా. ఇరిగేషన్‌ ప్రాజెక్టు నుంచి నన్ను దేవాదుల వాళ్లు దత్తత తీసుకున్నా నా తల రాత మారలేదు. మిషన్‌ భగీరథలో పరకాల నియోజకవర్గానికి, శాయంపేట మండలానికి తాగునీటిని అందిస్తున్నాను. మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి నన్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇరిగేషన్‌ సార్లూ రూ.3.82 కోట్లతో ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు చేయించారు. కానీ నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గతంలో చీఫ్‌విప్‌గా ఉన్నారు. ఆయన అన్న పట్టించుకుంటారన్న ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆ నిధులు సరిపోవంటూ దేవాదుల సార్లూ రూ.15కోట్లతో రిపేర్లు చేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. అవి ఎప్పుడు వస్తయే నేను ఎప్పుడు బాగుపడుతానో తెలియదు. తూము కుంగిపోయింది. ప్రధాన, కుడి, ఎడమ కాలువలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల బుంగలు పడ్డాయి. ఏ క్షణాన కూలుతానో తెలియని పరిస్థితి. వడు నెలల క్రితం కురిసిన వర్షానికి నాలో వరద ఎక్కువై ఎక్కడ కొట్టుకు పోతానో అని ఆందోళన చెందాను. దేవునిదయ వల్ల పరిస్థితి చేయి దాటలేదు. ఇప్పటికైనా పాలకులు అధ్వానంగా మారిన నన్ను పట్టించుకుంటారని ఆశిస్తున్నా. - ఇట్లు చలివాగు ప్రాజెక్టు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.