వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రు తండాలో ఉదయం మేతకు వెళ్లిన రెండు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాయి. తెగి పడ్డ విద్యుత్ తీగల వల్లే ప్రమాదం సంభవించిందంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో.. రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో కొద్ది రోజులనుంచి పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తెగి పడ్డ కరెంట్ తీగల గురించి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి పంట పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సవరించి.. తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: క్వింటాళ్ల కొద్ది చేపలు మృతి.. విష ప్రయోగమే కారణమా..?