వరంగల్ రూరల్ జిల్లా పరకాల శివారులోని చలి వాగు మత్తడి పొంగుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద కాలువలో నీటి ఉద్ధృతి పెరిగింది. కాలువలో నీరు వస్తున్నందువల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలంలో కట్టిన ఈ మత్తడి ఎప్పుడు కూలిపోతుందోనని పరకాల ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్తడి నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే తిరిగి చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో మోదీ సాహసాలు