ETV Bharat / state

గొర్రెకుంట బావి ఘటనలో ఆరుగురికి అంత్యక్రియలు పూర్తి

author img

By

Published : May 26, 2020, 9:40 PM IST

గొర్రెకుంట బావిలో దొరికిన ఘటనలో ఆరుగురికి మక్సూద్​ బంధువులు అంత్యక్రియలు చేశారు. స్థానిక ముస్లిం పెద్ద సమక్షంలో పోతన రోడ్డులోని శ్మశాన వాటికలో వారి సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. బిహార్​కు చెందిన శ్రీరామ్​, శ్యామ్​ మృతదేహాలతో పాటు షకీల్​ మృతదేహానికి క్లియరెన్స్​ రాకపోవడం వల్ల వాటిని భద్రపరిచారు.

గొర్రెకుంట బావి మృతదేహాల్లో ఆరింటికి అంత్యక్రియలు పూర్తి

వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో దొరికిన మక్సూద్ కుటుంబ సభ్యుల 6 మృతదేహాలకు అంత్యక్రియలను బంధువులు పూర్తి చేశారు. స్థానికుల ముస్లిం పెద్దల సమక్షంలో పోతన రోడ్డులోని కబ్రిస్తాన్​లో ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆరుగురికి అంతక్రియలు చేశారు.

ముందుగా సంగెం తహసీల్దార్..​ మృతుల బంధువుల నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం మృతదేహాలను అప్పగించారు. అయితే బిహార్​కు చెందిన శ్రీరామ్, శ్యామ్ మృతదేహాలతో పాటు షకీల్ మృతదేహానికి క్లియరెన్స్ రాకపోవడం వల్ల వాటిని మార్చురీలోనే భద్రపరిచారు. పోలీసుల నుంచి క్లియరెన్స్ రాగానే మిగిలిన మూడు మృతదేహాలకు అంతక్రియలు చేస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.