వరంగల్ గ్రామీణ జిల్లాలో ధరణి ఆస్తుల నమోదు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. పర్వతగిరి మండలంలో పర్యటించి ధరణి నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ధరణి వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయా అని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ధరణిలో ఆస్తులు నమోదు చేసుకున్న అర్హులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందించారు. ధరణి నమోదులో ఎలాంటి సమస్యలున్నా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సరికొత్త అందాలతో కనువిందు చేస్తోన్న ఓరుగల్లు