వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం మడిపెల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో మంచంపై పడుకున్న తల్లిదండ్రలపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడో కిరాతకుడు. వృద్ధులైన తల్లిదండ్రులు భూక్యా దస్రు, భాజీలకు కొడుకు కేతూరాంకు మధ్య కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం కూడా ఇదే విషయమై గొడవ జరగటంతో అగ్రహించిన కొడుకు వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల సజీవదహనం గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి