ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి.. నిర్జీవంగా తిరిగొచ్చాడు...

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట శివారులోని కోనారెడ్డి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు. రెండ్రోజులుగా అవిశ్రాంతంగా గాలిస్తున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందానికి నీటి ప్రవాహంలో నిర్జీవంగా కనిపించాడు.

author img

By

Published : Aug 23, 2020, 3:28 PM IST

a man who lost in konareddy pond died
కోనారెడ్డి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతి

వరంగల్ గ్రామీణ జిల్లా జఫర్​గఢ్​ మండలం హిమ్మత్​నగర్​కు చెందిన రాజేందర్​ అనే వ్యక్తి వర్దన్నపేట శివారులోని కోనారెడ్డి చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ చొరవతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రెండ్రోజులుగా అవిశ్రాంతంగా గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాజేందర్​ మృతదేహాన్ని ఎన్డీఆర్​ఎఫ్​ బృందం గుర్తించింది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

రెండ్రోజుల నుంచి తమ కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు నిర్జీవంగా ఉన్న రాజేందర్​ను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాజేందర్​ మృతి పట్ల ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సంతాపం వ్యక్తం చేశారు. అతణ్ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.