వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పల్లెబోయిన సంపత్ తన భార్యతో కలిసి రేగొండ మండలం వెంకటేశ్వర్లుపల్లిలో జీవిస్తున్నారు. సెల్ఫోన్ అధికంగా మాట్లాడుతోందనే అనుమానంతో భర్త భార్యను చంపేశాడని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెద్దపాప హర్షిత(12), మున్నా(9)ల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాలలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి : బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా?