నిజాం పాలనకు వ్యతిరేకంగా 1947 సెప్టెంబర్ 2న పరకాల పట్టణంలో జాతీయ జెండా ఎగుర వేయడానికి వచ్చిన దేశభక్తులపై జలియన్ వాలాబాగ్ సంఘటనను మరిపించే విధంగా రజాకార్లు కత్తులు, తుపాకులతో విచక్షణారహితంగా దాడి జరిపారు. ఈ ఘటనలో 15 మంది ఘటనాస్థలిలోనేే అసువులు బాశారు. వందల మంది గాయాలపాలయ్యారు. పరకాల ఊచకోత జరిగి నేటికి 73ఏళ్లు గడిచిపోయాయి.
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ సంస్థానం కూడా ఇంతటి పోరాటం చేసి భారత్లో విలీనం కాలేదు. కేంద్ర మాజీ మంత్రి వర్యులు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అమరవీరుల స్మారకంగా పరకాలలో అమరధామాన్ని నిర్మించారు. పరకాల అమరధామాన్ని పలువురు సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. నిజాం విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులను స్వాతంత్య్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినా.. రాష్ట్ర సర్కారు గుర్తించడం లేదన్నారు. ఇంతటి గొప్ప పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: పరకాల అమరధామం.. రజాకార్ల దాడికి సజీవ సాక్ష్యం