వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో రెండు వేరువేరు గ్రామాల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మరణించారు. ఆరేపల్లిలో వీరన్న అనే రైతు విద్యుత్ నియంత్రికకు ఫీజు సరి చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలొదిలారు. వీరన్నకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మైలారంలో కోటేశ్వర్రెడ్డి తన ఇంటి ప్రాంగణంలో బట్టలు ఆరేస్తుండగా... ప్రక్కనే ఉన్న విద్యుత్తీగ తాకి ప్రమాదం జరగ్గా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలతో రెండు గ్రామాల్లో విషాదం నిండుకుంది.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."