అన్యోన్యంగా ఉండే వారి కుటుంబంలో కరోనా మహమ్మారి తీరని విషాదాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్ కాటుకు బలయ్యారు. దీంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలయ్యారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం శ్రీ రంగాపూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన సాయి ప్రకాష్‌రావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఈ నెల 25న మృతి చెందారు. ప్రకాష్ అనారోగ్యంగా ఉన్పప్పడు సపర్యలు చేసిన ఆయన భార్య ఉమారాణి కూడా కొవిడ్ బారిన పడటంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. వారిద్దరి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు