వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో ఉన్న భీమా-2 (స్టేజ్- 1) నుంచి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శంకరసముద్రం జలాశయానికి నీటిని విడుదల చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సమీపంలో ఉన్న పంప్‌హౌస్ నుంచి నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు కోయిల్ సాగర్ జలాశయానికి నీటిని మోటార్ ఆన్ చేసి ప్రారంభించారు.
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆల అన్నారు. ఇప్పటికే రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల ఈ ఏడాది ముందుగానే ప్రాజెక్టులను నీటితో నింపేందుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: శ్రీశైలానికి వరద ప్రవాహం.. 815 అడుగులకు నీటిమట్టం