ETV Bharat / state

ఉప్పొంగుతున్న పాతాళగంగ... ఇళ్లల్లోకి ఉబికి వస్తున్న ఊట నీరు

నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండాయి. రంగసముద్రం బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ సైతం నిండి అలుగు పారుతుండగా... సమీంపంలోని ఇళ్లల్లో ఊట నీళ్లు ఉబికి వస్తున్నాయి.

water fount in houses in srirangapuram
water fount in houses in srirangapuram
author img

By

Published : Jul 25, 2020, 4:14 PM IST

Updated : Jul 25, 2020, 5:13 PM IST

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలోని ఇళ్లలోకి ఊట నీరు ఉబికి వస్తోంది. నెల నుంచి సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రంగసముద్రం రిజర్వాయర్​తో పాటు చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగసముద్రం రిజర్వాయర్ పక్కననున్న ఇళ్లల్లోకి ఊట నీరు వస్తోంది. ఊట నీటితో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ఆయా నివాసాల్లో ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగసముద్రం రిజర్వాయర్ కట్టే సమయంలో సమీపంలోని ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేసినా... అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి... రిజర్వాయర్ సమీపంలో ఉన్న స్థానికులకు పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఇళ్లు కూలిపోయాయని వాపోయారు. బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

సమృద్ధి వర్షాలతో ఇళ్లలోకి ఉబికి వస్తున్న ఊట నీరు

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

Last Updated : Jul 25, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.