ETV Bharat / state

Electric Bicycle: యూట్యూబ్​లో చూసి ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ - electric bicycle by wanaparthy student

లాక్​డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న ఓ విద్యార్థి పర్యావరణ హిత యోచన చేశాడు. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా ఏదైనా చేయాలనుకుని ఎలక్ట్రిక్ సైకిల్ రూపొందించాడు. పెట్రోల్ ధర పెరుగుతుండటం.. ఇంధనాల వల్ల జరుగుతున్న వాతావరణ కాలుష్యం తగ్గించడానికే ఈ ప్రయత్నమని చెబుతున్నాడు.

electric bicycle, electric bicycle design by inter student
ఎలక్ట్రిక్ సైకిల్, వనపర్తిలో ఎలక్ట్రిక్ సైకిల్, బ్యాటరీ సైకిల్
author img

By

Published : Jun 14, 2021, 2:24 PM IST

లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వనపర్తి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేశాడు. పర్యావరణ పరిరక్షణకు పెట్రోల్‌ వాడకం తగ్గించాలని దీన్ని రూపొందించినట్లు తెలిపాడు.

పాత సైకిల్​తో..

అమరచింత మండలం ప్రతాప్‌నగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి మణికంఠ పాత సైకిల్‌ను ఎలక్ట్రిక్‌ సైకిల్‌గా మార్చాడు. దీనికోసం యూట్యూబ్‌లో వీడియోలు చూసి కావాల్సిన వస్తువులు , తయారీ విధానం సేకరించాడు. బ్యాటరీ, కంట్రోలర్, మోటార్, త్రోటల్, బ్రేక్, హెడ్ లైట్, ఛార్జర్, తాళం ఉన్న కిట్ తెప్పించుకుని పాత సైకిల్‌కు బిగించాడు.

4 గంటల ఛార్జింగ్.. 25 కి.మీ.

4 గంటల ఛార్జింగ్‌తో 25 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని మణికంఠ చెబుతున్నాడు. 13వేల 500తో ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశానని తెలిపాడు. కుమారుడు తయారు చేసిన సైకిల్‌ను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తన వంతు సాయం చేయాలనే ఈ సైకిల్​ను రూపొందించినట్లు మణికంఠ తెలిపాడు.

బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.