వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులకు ఆస్కారం ఉండకూడదని ఆర్డీఓ చంద్రారెడ్డి అన్నారు. వనపర్తిలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మీసేవ కేంద్రం ఆపరేటర్లు, తహశీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. మీసేవ సెంటర్ వారు ఓటరు పరిశీలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటరు పరిశీలన కార్యక్రమం ద్వారా ఓటర్ఐడీలో తప్పులను సరిచేసుకోవాలని, కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.
- ఇదీ చూడండి : యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మండలిలో తీర్మానం