రైతు వేదికలను అక్టోబరు 10 నాటికి పూర్తిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష స్పష్టం చేశారు. పానుగల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను పాలనాధికారి తనిఖీ చేశారు.
సాంకేతిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నత్తనడకన సాగడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు వేదికల పురోగతి, సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు.
ఇవీచూడండి: 'అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి'