దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ సంబురాల్లో భాగంగా వనపర్తిలో ఫ్రీడం రన్ పేరిట 2కె రన్ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన రన్‌ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్ర సాధనలో ఎందరో మహానుభావులు, సమరయోదుల త్వాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.